కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసులు
- గాంధీభవన్ లో టీ-పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం
- రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్చ
- ఇరవైనాలుగు గంటల్లోగా సమాధాన మివ్వాలని ఆదేశం
పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చేసిన రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ వ్యాఖ్యలపై ఇరవైనాలుగు గంటల్లోగా సమాధాన మివ్వాలని ఆదేశిస్తూ ఈ నోటీసులు జారీ చేసింది. కాగా, తొలిసారి జారీ చేసిన షోకాజ్ నోటీసులకు రాజగోపాల్ రెడ్డి మూడు పేజీల వివరణ ఇచ్చారు. ఈ వివరణతో సంతృప్తి చెందని క్రమశిక్షణ కమిటీ మరోసారి రాజగోపాల్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేయడం గమనార్హం.