ప్రణయ్ కి వేరే అమ్మాయిలతో సంబంధాలు లేవు: అమృత
- ప్రణయ్ గురించి తెరపైకి వస్తున్న కొత్త విషయాలు
- ప్రణయ్ ఓ రోమియో అంటూ ప్రచారం
- స్నేహితులతో మాట్లాడినంత మాత్రాన రోమియో అంటారా అంటూ అమృత ఆవేదన
ఈ అంశాన్ని పక్కన పెడితే... ప్రణయ్ గురించి సోషల్ మీడియాలో పలు విషయాలను కొందరు ప్రస్తావిస్తున్నారు. ప్రణయ్ ఒక రోమియో అని... తొమ్మిదవ తరగతిలోనే అమృతను ప్రేమించిన ప్రణయ్ కు వేరే అమ్మాయిలతో కూడా సంబంధాలు ఉన్నాయంటూ సరికొత్త చర్చకు తెరతీశారు. ఇదే అంశాన్ని ఓ మీడియా ఛానల్ అమృత వద్ద ప్రస్తావించింది.
దీనికి సమాధానంగా అమృత మాట్లాడుతూ, ప్రణయ్ ఉన్నది తనతో, అతని తల్లిదండ్రులతో అని... తనకు తెలియని విషయాలు బయటివారికి ఎలా తెలుస్తాయని ప్రశ్నించింది. కాలేజ్ ఫ్రెండ్స్ తో మాట్లాడటం సాధారణంగా జరిగేదేనని... తన ఫ్రెండ్స్ తో తాను కూడా మాట్లాడతానని... ఇందులో తప్పేముందని అడిగింది. ఒక అమ్మాయితో మాట్లాడినంత మాత్రాన రోమియో అనడం సరికాదని చెప్పింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది.