అమితాబ్ అడిగిన ప్రశ్నకు సిగ్గుతో ఎర్రబారిన అనుష్క ముఖం!
- కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి హాజరైన అనుష్క
- కోహ్లీ ఫ్లయింగ్ కిస్ లపై ప్రశ్నించిన అమితాబ్
- అమితాబ్ ప్రశ్నకు సిగ్గుపడ్డ అనుష్క
ఇదే విషయంపై అనుష్కను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆటపట్టించారు. కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి సామాజిక కార్యకర్త సుధా వర్గీస్ తో పాటు అనుష్క హాజరైంది. ఈ సందర్భంగా ఈ ఫ్లయింగ్ కిస్ ల గురించి అమితాబ్ ప్రశ్నించగా... అనుష్క మొహం సిగ్గుతో ఎరుపెక్కింది. అయితే, సమాధానాన్ని కూడా అంతే కొంటెగా చెప్పింది. తాను కోహ్లీ కోసమే క్రికెట్ ను చూడనని... దేశం కోసం చూస్తానని తెలివిగా సమాధానం ఇచ్చింది. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి.