మోదీని వెనక్కి నెట్టేసిన రాహుల్.. కాంగ్రెస్ చీఫ్ ట్వీట్లలో వ్యంగ్యానికి నెటిజన్ల ఫిదా.. మిచిగాన్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి
- రాహుల్ ట్వీట్లలో దూకుడు
- విమర్శలకు కాస్తంత వ్యంగ్యం
- అధ్యయనంలో వెల్లడి
గత ఎన్నికల్లో మోదీ సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకున్నారు. ఆయన ప్రధాని కావడానికి ఇది కూడా కీలకంగా మారింది. దీంతో ఆయన తర్వాత నేతలందరూ ఇదే బాట పట్టారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను ఉపయోగించుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే, రాహుల్ తాను చేసే విమర్శలకు కొంత వ్యంగ్యం జోడిస్తూ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నారు. ఇక, చాలామంది నేతలు తమ ట్వీట్లను ప్రాంతీయ భాషల్లో చేస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధ్యయనంలో తేలింది.