bihar: ఐదో తరగతి విద్యార్థినిని గర్భవతిని చేసిన హెడ్మాస్టర్!

  • బిహార్ రాజధాని పట్నాలో దారుణం
  • స్కూల్ బాలికపై హెడ్మాస్టర్ అత్యాచారం
  • కేసు నమోదుచేసిన పోలీసులు
విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఓ టీచర్ దారి తప్పాడు. ఓ అమ్మాయి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లైంగికదాడికి పాల్పడ్డాడు. దీన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఘటన బిహార్ రాజధాని పట్నాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సదరు ప్రబుద్ధుడిని కటకటాల వెనక్కు నెట్టారు.

పట్నాలోని ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలికను హెడ్మాస్టర్ హోంవర్క్ చూసే నెపంతో తన గదిలోకి పిలిపించుకున్నాడని పోలీసులు తెలిపారు. అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని వెల్లడించారు. ఈ ఘటనను క్లర్క్ చేత వీడియో తీయించిన సదరు ప్రబుద్ధుడు.. బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగికదాడికి దిగేవాడన్నారు. ఇలా 9 నెలల పాటు బాధితురాలిపై హెడ్మాస్టర్ లైంగికదాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు.

ఇటీవల బాలికకు వాంతులు రావడంతో ఆసుపత్రికి వెళ్లగా అమ్మాయి గర్భవతి అని తేలిందన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సదరు హెడ్మాస్టర్ తో పాటు క్లర్క్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు.
bihar
patna
rape
headmaster
school girl
Police

More Telugu News