మీ కుమారుడు డైరెక్టర్ గా ఉన్న కంపెనీ భాగోతంపై చర్చిద్దామా?: కన్నాకు బుద్ధా సవాల్
- పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కన్నాకు మించిన కళంకితుడు మరెవరైనా ఉన్నారా?
- ఐదు లక్షల ఎకరాల భూకబ్జాలో కన్నా పాత్ర ఎంత?
- సైకిల్ పై తిరిగిన కన్నాకు భవంతులు, ఢిల్లీలో ఫ్లాట్స్ ఎలా వచ్చాయి?
సైకిల్ పై తిరిగిన కన్నాకు భవంతులు, ఢిల్లీలో ఫ్లాట్స్ ఎలా వచ్చాయని బుద్ధా ప్రశ్నించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కన్నాకు మించిన కళంకిత మంత్రి మరెవరైనా ఉన్నారా? అని అడిగారు. మీ కుమారుడు డైరెక్టర్ గా ఉన్న కంపెనీ భాగోతంపై చర్చకు సిద్ధమేనా? అని కన్నాకు సవాల్ విసిరారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల స్క్రిప్ట్ చదువుతూ... చంద్రబాబుపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.