వాయల్పాడు సీఐపై సీఎం చంద్రబాబు గుస్సా.. క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశం!
- వివాహితను వేధించిన సీఐ తేజోమూర్తి
- బాధితురాలికి అండగా ఉంటామని హామీ
- ఇప్పటికే సీఐని సస్పెండ్ చేసిన డీఐజీ
తనకు తెలియకుండా భర్త రెండో వివాహం చేసుకోవడంపై మదనపల్లెకు చెందిన సంయుక్త అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో బాధితురాలిపై కన్నేసిన స్టేషన్ సీఐ తేజోమూర్తి తన కోరిక తీర్చాలని వేధించాడు. తిరుమల కొండపై తాను విధులు నిర్వహిస్తున్నాననీ, వస్తే ఇద్దరం కలసి ఎంజాయ్ చేద్దామని ఒత్తిడి చేశాడు. ఈ వేధింపులు హద్దులు దాటడంతో సంయుక్త మహిళా సంఘాలతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ ఆడియో, వీడియో, సందేశాల రికార్డులను పరిశీలించిన డీఐజీ శ్రీనివాస్ తేజోమూర్తిని సస్పెండ్ చేశారు.