ప్రణయ్ పరువు హత్యపై స్పందించిన హీరోయిన్ పూనమ్ కౌర్!
- పరువు హత్యపై పూనమ్ ఆవేదన
- ఘటన మనసును కలచివేస్తోందని వ్యాఖ్య
- ట్విట్టర్ లో స్పందించిన నటి
‘ప్రజలంతా ప్రేమకు వ్యతిరేకంగా ఎందుకున్నారు? ఇలాంటి పనుల ద్వారా ఏం సాధిస్తారు? అమృత-ప్రణయ్ జంటకు న్యాయం జరిగేది ఎప్పుడు? మనం నిజంగానే 21వ శతాబ్దంలో ఉన్నామా? ప్రణయ్ హత్య, అమృత రోదన నా మనసును కలచివేస్తోంది’ అని పూనమ్ ట్వీట్ చేసింది. అమృత-ప్రణయ్ ల ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియో లింక్ ను ఈ ట్వీట్ కు ఆమె జత చేసింది.