ఏపీలో టీడీపీతో కలిసే సమస్యే లేదు: ఊమెన్ చాందీ
- 175 నియోజకవర్గాల్లోనూ ఒంటరిగా పోటీ
- రేపు కర్నూలులో రాహుల్ గాంధీ పర్యటన
- ఏర్పాట్లు పూర్తయ్యాయన్న ఊమెన్ చాందీ
తన పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర రెడ్డి కుటుంబీకులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారని ఊమెన్ చాందీ వెల్లడించారు. ఆపై విద్యార్థులు, యువతీ యువకులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారని, తరువాత జరిగే బహిరంగ సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారని చెప్పారు. రాహుల్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు సంతృప్తికరంగా సాగుతున్నాయని అన్నారు.