హైదరాబాద్ లో దారుణం... అదనపు కట్నం కోసం భార్యను చంపిన భర్త!
- జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- గత సంవత్సరం సిరాజ్, అసిమాలకు వివాహం
- అప్పటి నుంచి వేధిస్తున్న సిరాజ్
- హత్య చేసి పరారీలో... కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ క్రమంలో భార్యతో మంచిగా ఉన్నట్టు నటిస్తున్న సిరాజ్, నిన్న రాత్రి ఇంట్లో మామ, బావ మరిది, మరదళ్లు నిద్రిస్తుండగా, వారి గదులకు తాళం పెట్టి, భార్య గొంతును కత్తితో కోశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె మరణించింది. ఆపై సనత్ నగర్ లోని తన ఇంటికి వెళ్లిన సిరాజ్, తల్లిదండ్రులను తీసుకుని పరారయ్యాడు. ఉదయం గది బయట తలుపు వేసి ఉండటంతో గమనించిన సిరాజ్ మామ అస్లాంఖాన్, పక్కింటి వారికి ఫోన్ చేసి బయటకు వచ్చి చూడగా, అసీమా మృతదేహం కనిపించింది. దీంతో అస్లాంఖాన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నిందితుడు సిరాజ్ సెల్ ఫోన్ సిగ్నల్స్ సనత్ నగర్ వరకూ వెళ్లి కట్ అయ్యాయని గుర్తించామని, అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.