'ప్రణయ్ ని చంపేశారు' అని చెబితే, 'సరిగ్గా వినపడ్డం లేదు...' అని అమృతతో అన్న మారుతీరావు!
- ఆసుపత్రి ముందు ప్రణయ్ పై దాడి
- తండ్రికి వెంటనే ఫోన్ చేసిన అమృత
- ఫోన్ కట్ చేసిన మారుతీరావు
తాను ఏడుస్తూ జరిగినదంతా చెప్పగా, ఆయన సరిగ్గా వినిపించడం లేదని అంటూ, తనను ఆసుపత్రిలోకి వెళ్లాలని సలహా ఇచ్చి, ఫోన్ కట్ చేశాడని చెప్పుకొచ్చింది. తమను డాడీ మనుషులు ఫాలో అవుతున్నారని తెలుసుకానీ, ఇంత దారుణం చేస్తారని ఊహించలేదని, ఆసుపత్రికి రాకున్నా ప్రణయ్ బతికుండేవాడేమోనని అమృత కన్నీటిపర్యంతమైంది.