జియోకి పోటీగా కొత్త ఆఫర్ ప్రకటించిన ఎయిర్ టెల్!

  • రూ.97 పేరిట కొత్త ఆఫర్ 
  • రోజుకి 1.5జీబీ, 350 నిమిషాల వాయిస్ కాల్స్
  • 28 రోజుల వ్యాలిడిటీ
జియో రూ.98 ఆఫర్ కి పోటీగా ఎయిర్ టెల్ కొత్త ఆఫర్ ని ప్రకటించింది. తాజాగా దేశ వ్యాప్తంగా ఉన్న తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఎయిర్ టెల్ రూ.97 పేరిట నూతన ఆఫర్ ని తీసుకొచ్చింది. ఈ ఆఫర్ లో భాగంగా 350 నిమిషాల ఉచిత వాయిస్ కాల్స్, 200 ఎస్ఎంఎస్ లతో పాటు రోజుకి 1.5జీబీ 3జీ /4జీ డేటాని పొందుతారు. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. రీఛార్జి చేసుకోవాలనుకునే వినియోగదారులు ఎయిర్ టెల్ వెబ్ సైట్ గాని లేదా మై ఎయిర్ టెల్ యాప్ ని గాని సందర్శించాలి. కాగా, 28 రోజుల వ్యాలిడిటీ గల జియో రూ.98 ఆఫర్లో అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకి 2 జీబీ డేటాతో పాటు 300ఎస్ఎంఎస్ లని వినియోగదారులు పొందుతారు. 
Go Back to Shorts
airtel
jio
Reliance
offer

More Telugu News