trivikram: పవన్ కోసం రెడీ చేసిన కథ .. హీరోగా వెంకటేశ్

  • 'అరవింద సమేత'తో బిజీగా త్రివిక్రమ్ 
  • దసరాకి ప్రేక్షకుల ముందుకు 
  • నెక్స్ట్ మూవీ వెంకటేశ్ తో  

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్టు తరువాత త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను వెంకటేశ్ తో చేయనున్నాడు. కొంతకాలం క్రితం వెంకటేశ్ కి త్రివిక్రమ్ ఒక కథ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి.

అసలు ఈ కథను పవన్ కోసం త్రివిక్రమ్ సిద్ధం చేయగా, తనకి బాగా నచ్చిందని పవన్ అన్నాడట. ఆ తరువాత పవన్ రాజకీయాల్లో బిజీగా మారిపోయాడు. అందువలన త్రివిక్రమ్ అదే కథను వెంకటేశ్ తో చేయనున్నాడనేది తాజా సమాచారం. 'అరవింద సమేత' విడుదల కాగానే త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టు పనులు మొదలుపెడతాడని అంటున్నారు. ప్రస్తుతం 'ఎఫ్ 2' సినిమా చేస్తోన్న వెంకటేశ్, ఆ తరువాత 'వెంకీమామా' చేస్తూనే త్రివిక్రమ్ ప్రాజెక్టుపై దృష్టిపెడతాడని చెబుతున్నారు.   

More Telugu News