Uttar Pradesh: మళ్లీ ఆడపిల్లే పుట్టడంతో కసాయిగా మారిన తండ్రి!

షార్ట్స్‌లో చూడండి
మళ్లీ కూతురే పుట్టిందన్న ఆగ్రహంతో ఓ కసాయి తండ్రి మృగంలా మారిపోయాడు. భార్య రెండో కాన్పులోనూ ఆడపిల్లకే జన్మనిచ్చిందని తెలిసి రెండేళ్ల పెద్ద కూతుర్ని మేడపై నుంచి విసిరేసి తనలోని కసాయితనాన్ని చాటుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని పెర్దోలి గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన రోజు కూలీ ఆర్వింద్ గాంగ్వర్‌ భార్య రెండో బిడ్డకు ఆసుపత్రిలో జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసి ఆసుపత్రికి వెళ్లిన గాంగ్వర్‌ పుట్టింది ఆడపిల్లని తెలియగానే ఆగ్రహోదగ్రుడయ్యాడు. చెంతనే ఉన్న తన పెద్ద కుమార్తె కావ్యను తీసుకుని ఆసుపత్రి రెండో అంతస్తుకు వెళ్లాడు. అక్కడి నుంచి బాలికను కిందికి తోసేశాడు. అనంతరం పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాలిక ప్రస్తుతం చికిత్స పొందుతోంది. 
Go Back to Shorts
Uttar Pradesh

More Telugu News