నేడు వినాయక చవితి.. కోలాహలంగా వీధులు.. కిక్కిరిసిన మార్కెట్లు!
- ఇలలో తొలి పూజలందుకునే గణనాథుడు
- సర్వాంగ సుందరంగా మండపాలు
- జనాలతో కిక్కిరిసిన మార్కెట్లు
మార్కెట్లు, వీధులు కిక్కిరిసిపోయాయి. పార్వతీ తనయుడంటే ఎంతగానో ఇష్టపడే చిన్నారులు గల్లీకి ఒకటి రెండు చిన్నచిన్న మండపాలు వేసి ఏకదంతుడి పూజకు సిద్ధమవుతున్నారు. తమకు తోచిన రీతిలో గణనాథుడిని పూజించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు, విగ్రహాలు, పండ్లు, పత్రుల కొనుగోలుతో మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. వచ్చేవారు, వెళ్లేవారితో రద్దీగా మారిపోయాయి. ఎక్కడ చూసినా భక్తి వెల్లివిరుస్తోంది. ఏకదంతుడి నామస్మరణతో పల్లెల నుంచి నగరాల వరకు మార్మోగనున్నాయి.