Pawan Kalyan: వంచనకు గురైన నన్ను పవన్ కల్యాణ్ ఆదరించారు: ‘జనసేన’లో చేరిన పితాని బాలకృష్ణ
- పితానికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్
- పవన్ కల్యాణ్ కు పాదాభివందనం చేస్తున్నా
- ఆయనకు నా కృతఙ్ఞతలు
తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన వైసీపీ నేత పితాని బాలకృష్ణ ఈరోజు జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని ‘జనసేన’ కార్యాలయంలో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ‘జనసేన’ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, పితానికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం, పితాని బాలకృష్ణ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ కు పాదాభివందనం చేస్తున్నానని, ఆయనకు తన కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ‘వంచనకు గురైన పితాని బాలకృష్ణకు ఎవరూ లేరని, నన్ను చిన్నచూపు చూశారు. పవన్ కల్యాణ్ గారు నన్ను ఆదరించి ఈ పార్టీలో బాధ్యతలు అప్పజెప్పినందుకు మరోసారి కృతఙ్ఞతలు’ అని చెమ్మగిల్లిన కళ్లతో అన్నారు.
‘అతి పేద కుటుంబం నుంచి వచ్చాను. చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకునే వాడిని. ఏదో భగవంతుడి దయవల్ల, అంచెలంచెలుగా ఎదిగా. నా ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశా. అమ్మోరు దయవల్ల.. ఐశ్వర్యం నాకు లభించింది. పది మందికి సేవ చేయాలనే ఉద్దేశం ఉన్న నన్ను ఓ మోసపూరితమైన నాయకుడు తీసుకెళ్లాడు. నాకు టికెట్ ఇస్తాను రమ్మనమని చెప్పి.. నా ఉద్యోగానికి రాజీనామా చేయించాడు. నన్ను మోసం చేశాడు.. మరి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గుడో ఒక్కసారి మీరు ఆలోచించాలి. విశ్వసనీయత, మాటతప్పడం, మడమ తిప్పడం..అనేవి పైకి షోయింగ్ లు తప్ప, లోపలంతా దుర్మార్గం, కుట్ర, కుతంత్రం. ఈ కౌగిలించుకోవడాలు, ముద్దుపెట్టుకోవడాలు అంతా మోసం.. ఎవరూ నమ్మకండి!’ అని ఘాటు విమర్శలు చేశారు.