జూనియర్ ఎన్టీఆర్ సినిమా వేడుకకు ఊహించని అతిథి!

  • శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న 'అరవింద సమేత'
  • ఈ నెల 20న హైదరాబాదులో ఆడియో ఫంక్షన్
  • చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్న అమితాబ్ బచ్చన్
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'అరవింద సమేత' చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే యోచనలో యూనిట్ సభ్యులు ఉన్నారు. మరోవైపు ఈ నెల 20వ తేదీన హైదరాబాదులోని నొవాటెల్ లో ఆడియో వేడుక నిర్వహించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

 ఈ వేడుకకు బాలయ్య లేదా మహేష్ బాబులలో ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్ గా హాజరవుతారనే వార్తలు నిన్నటిదాకా వినిపించాయి. అయితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో అమితాబ్ కూడా ఓ ముఖ్య పాత్రను పోషించారట. అయితే, సినిమా విడుదల వరకు ఈ అంశాన్ని సీక్రెట్ గా ఉంచాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. మరి, ఇందులో ఎంత నిజం ఉందో...  వేచి చూడాల్సిందే.
Go Back to Shorts
junior
ntr
aravinda sameta
trivikram
audio function
Amitabh Bachchan
chief guest
tollywood
bollywood

More Telugu News