మరో సినిమాకు సిద్ధమవుతున్న విశాల్, తమన్నా జంట
- సుందర్.సి. దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా
- ప్రస్తుతం ‘అత్తారింటికి దారేది’ని రీమేక్ చేస్తున్న సుందర్
- విడుదలకు నోచుకోని మదగజరాజ చిత్రం
తాజాగా ఇప్పుడు సుందర్.సి. దర్శకత్వంలో కోలీవుడ్‌లో విశాల్, తమ్ము జంటగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. సుందర్ ప్రస్తుతం శింబు హీరోగా 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగానే విశాల్, మిల్కీ బ్యూటీ కాంబోలో సినిమాను మొదలుపెట్టనున్నారు. ఈ ముద్దుగుమ్మకి తమిళంలో రెండు సంవత్సరాలుగా అవకాశాలే లేవు. ఇప్పుడు సుందర్ తన చిత్రంలో అవకాశం కల్పించారు. ఈ చిత్రమైనా విశాల్, తమ్ము జంటకు కలిసొస్తుందో లేదో వేచి చూడాలి.