పాలకుర్తి సీటు విషయంపై పునరాలోచించాలి!: కేసీఆర్ కు టీఆర్ఎస్ నేత రవీందర్‌రావు విజ్ఞప్తి
- టీఆర్ఎస్ టికెట్ దక్కని నేతల్లో బయటపడుతున్న అసంతృప్తి
- పాలకుర్తి టికెట్ విషయంలో పునరాలోచించాలని కేసీఆర్‌కు వినతి
- దయాకర్ రావు టీఆర్ఎస్‌లో చేరాక అభివృద్ధి శూన్యమని విమర్శ
2004 నుంచి వరుసగా మూడు పర్యాయాలు టికెట్ ఆశించానని.. కానీ కేసీఆర్ ఆదేశాల మేరకు తప్పుకున్నానని తెలిపారు. ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత పాలకుర్తిలో అసలు ఏమాత్రం అభివృద్ధి జరగలేదని విమర్శించారు. పాలకుర్తి అసెంబ్లీ స్థానం విషయంలో కేసీఆర్ పునరాలోచించి ఆ నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.