సల్మాన్‌ ఖాన్‌ను పెళ్లి చేసుకుంటానంటూ వచ్చిన ఉత్తరాఖండ్ యువతి.. ఇంటివద్ద హల్‌చల్!
Add ap7am to your home Screen

సల్మాన్‌ ఖాన్‌ను పెళ్లి చేసుకుంటానంటూ వచ్చిన ఉత్తరాఖండ్ యువతి.. ఇంటివద్ద హల్‌చల్!

  • సల్మాన్ ఇంటికి చేరుకున్న ఉత్తరాఖండ్ యువతి
  • పెళ్లాడేందుకు వచ్చానంటూ హంగామా
  • మతిస్థిమితం లేదన్న పోలీసులు
ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉండే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ ఇంటికి చేరుకున్న ఓ యువతి హల్‌చల్ చేసింది. తానతడిని పెళ్లాడేందుకు వచ్చానని, తనను లోపలికి పంపాలని సెక్యూరిటీ గార్డులతో వాగ్వాదానికి దిగింది. వారు అడ్డుకోవడంతో అక్కడే ఉన్న బ్రిడ్జిపై హల్‌చల్ చేసింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరాఖండ్‌కు చెందిన 24 ఏళ్ల యువతి నటుడు సల్మాన్ ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్‌కు చేరుకుంది. సల్మాన్ అంటే తనకు ఇష్టమని, ఆయనను వివాహం చేసుకునేందుకు ఉత్తరాఖండ్ నుంచి వచ్చానని పేర్కొంది. తనను సల్మాన్ ఇంటిలోకి పంపాలంటూ అక్కడి సెక్యూరిటీ గార్డులను కోరింది. అందుకు వారు నిరాకరించడంతో వాగ్వాదానికి దిగింది. అయినప్పటికీ వారు లోపలికి పంపకపోవడంతో అక్కడే ఉన్న బ్రిడ్జిపైకి ఎక్కి కేకలు వేసింది.

అటూఇటూ తిరుగుతూ నానా హంగామా చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రవర్తనలో తేడాను గుర్తించిన పోలీసులు పరీక్షల కోసం ఆసుపత్రికి పంపగా.. యువతికి మతిస్థిమితం లేదని తేల్చారు. ఆమె వద్ద ఉన్న మొబైల్ నంబర్ల ఆధారంగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించి ఆమెను అప్పగించారు.
Mumbai
Bollywood
Salman Khan
Uttarakhand
Girl
Marriage

More Telugu News