మంత్రి కేటీఆర్ కు పావుగంటలో చొక్కా కుట్టిచ్చిన ‘మేరు సంఘం’!

షార్ట్స్‌లో చూడండి
మేరు సంఘం ప్రతినిధులు మంత్రి కేటీఆర్ కు పావుగంటలో చొక్కా కుట్టించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మేరు సంఘం జనరల్ సెక్రటరీ వి.మాధవ్ సారథ్యంలో కర్నె సంథ్య, కర్నె మల్లేశ్, లక్ష్మీనారాయణ తదితరులు కేటీఆర్ కు చొక్కా కుట్టేందుకు కొలతలు తీసుకున్నారు. ప్రగతి నివేదన సభా ప్రాంగణంలో ఉంచిన ఎలక్ట్రానిక్ కుట్టు మిషన్ల ద్వారా అక్కడికక్కడే చొక్కాను కుట్టి కేటీఆర్ కు అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీలోనే ఈ చొక్కాను కేటీఆర్ ధరించారు. ఈ సందర్భంగా మేరు సంఘం ప్రతినిధులను ఆయన అభినందించారు.
Go Back to Shorts
KTR
meru sangham

More Telugu News