Uttar Pradesh: రూ.1500 అప్పు తీర్చలేదని.. 17 ఏళ్ల బాలికపై అత్యాచారం!

షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. రూ. 1500 అప్పు తీర్చలేదని 17 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. మురుద్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ ఖర్చుల కోసం జాహిద్, మోహన్ పాల్ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద బాధితురాలు రూ. 1500 అప్పు తీసుకుంది. చదువును మధ్యలోనే ఆపేసిన ఆమె, కుటుంబ బాధ్యతలను చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో, అప్పు తీర్చాలంటా బాధితురాలిపై జాహిద్, మోహన్ లు ఒత్తిడి తీసుకొచ్చారు. తనకు కొంచెం సమయం కావాలని ఆమె అడిగింది.

ఈ క్రమంలో ఆమె సైకిల్ పై వస్తుండగా జాహిద్, మోహన్ లతో పాటు మరో మైనర్ బాలుడు ఆమెను అడ్డుకున్నారు. అప్పు చెల్లించాలని అడగ్గా, డబ్బు లేదని ఆమె తెలిపింది. దీంతో, ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి, అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలియడంతో... వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఘజియాబాద్ ఎస్పీ మాట్లాడుతూ, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడకపోయినప్పటికీ, నేరానికి సాయపడ్డాడని తెలిపారు. అందువల్ల అతన్ని జువైనల్ హోమ్ కు తరలించామని చెప్పారు. 
Go Back to Shorts
Uttar Pradesh
rape

More Telugu News