sensex: అమ్మకాల ఒత్తిడితో స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • వరుసగా రెండో రోజు నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు
  • 32 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 15 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను నమోదు చేశాయి. డెరివేటివ్ కాంట్రాక్టులు ముగుస్తున్న నేపథ్యంలో, అమ్మకాలకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 32 పాయింట్లు నష్టపోయి 38,690కి పడిపోయింది. నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయి 11,676 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బాష్ లిమిటెడ్ (9.87%), గ్రీవ్స్ కాటన్ (7.81%), దేనా బ్యాంక్ (7.03%), ఎస్ఆర్ఈఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (6.63%), పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ (6.15%).  

టాప్ లూజర్స్:
క్వాలిటీ (-4.98%), యూఫ్లెక్స్ లిమిటెడ్ (-4.84%), క్వెస్ కార్ప్ (-3.84%), హెచ్డీఐఎల్ (-3.80%), స్పైస్ జెట్ (-3.75%).      

More Telugu News