Vajpayee: నమ్మలేని ఫొటో... వాజ్ పేయి అస్థికలను జారవిడిచిన నేతలు... పట్టుకున్న అదృశ్యహస్తం... కెమెరాకు చిక్కింది!

షార్ట్స్‌లో చూడండి
న్యూఢిల్లీలో మాజీ ప్రధాని, దివంగత వాజ్ పేయి అస్థికలను నిమజ్జనం చేస్తున్న వేళ, తీసిన కొన్ని చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న చిత్రాలను బట్టి, ఓ అదృశ్య హస్తం ఇక్కడ కనిపిస్తోంది. కొందరు నేతలు మరపడవలో వెళ్లిన వేళ, ఓ నేత అస్థికలను రెండు చేతులతో పట్టుకుని కలశాన్ని నీటిలోకి పైనుంచి వదిలారు. ఆ సమయంలో దాని ఎదురుగా ఉన్న బోట్ లోని ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీశారు. గాల్లో నుంచి పడుతున్న అస్థికల కలశాన్ని, ఓ అదృశ్యహస్తం పట్టుకుని నీటిలో నెమ్మదిగా వదులుతున్నట్టు ఓ ఫొటోలో కనిపించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. పైగా ఈ ఫొటోను మనోజ్ తివారీ షేర్ చేయడంతో నిమిషాల్లో వైరల్ అయి, కొత్త చర్చకు తెరదీసింది. ఇది ఫేక్ ఫొటో అని కొందరంటుంటే, వాజ్ పేయి అభిమానులు అదృశ్య హస్తమేనని అంటున్నారు. ఆ ఫొటోలను మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
Vajpayee
BJP
River
Magic Hand

More Telugu News