Harikrishna: అభిమానులకు తన స్వహస్తాలతో హరికృష్ణ రాసిన చివరి లేఖ... చివరి కోరిక ఇదే!

షార్ట్స్‌లో చూడండి
ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నందమూరి హరికృష్ణ, తన అభిమానులకు చేసిన ఆఖరి విజ్ఞప్తి ఇది. ఆయన తన స్వహస్తాలతో రాసిన చివరి లేఖలో కేరళను ఆదుకోవాలని ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు. ఆ లేఖ పూర్తి పాఠం...

"సెప్టెంబర్ 2న నా అరవై రెండవ పుట్టిన రోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాల కారణంగా, ఎంతో మంది మరణించారు. వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించిన విషయం. ఇందుచేత నా జన్మదిన సందర్భంగా, బేనరులు, ప్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్పగుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని, వాటికి అయ్యే ఖర్చుని వరదలు, వర్షాల వల్ల నష్టపోయిన వారి కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, మందులు, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను"
ఇట్లు
నందమూరి హరికృష్ణ
Go Back to Shorts
Harikrishna
Fans
Letter
Last Letter

More Telugu News