షర్మిలా.. నిన్ను ఈ రోజు మిస్ అవుతున్నా!: ట్వీట్ చేసిన వైఎస్ జగన్

రాఖీ పండుగ సందర్భంగా ప్రజా సంకల్పయాత్రలో ఉండటంతో సోదరి షర్మిలను మిస్ అవుతున్నానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అక్కాచెల్లెళ్లు అందరికీ జగన్ ట్వీట్టర్ లో రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. షర్మిలకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని వ్యాఖ్యానించారు.

‘షర్మిల.. రాఖీ పండుగ సందర్భంగా నిన్ను మిస్ అవుతున్నా. అన్నగా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయ్. తెలుగు రాష్ట్రాల్లోని అక్కాచెల్లెళ్లందరికీ మీ జగనన్న రక్షా బంధన్ శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా విశాఖలో ఉన్న జగన్ ఈ రోజు ధారభోగాపురం వద్ద పార్టీ నేతలతో కలసి రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు మహిళా నేతలు జగన్ కు రాఖీలు కట్టారు. మిఠాయిలు తినిపించి ఆశీస్సులు పొందారు.
Go Back to Shorts
ys jagan
sharmila
rakhi festival
raksha bhandan
Visakhapatnam District

More Telugu News