మేకపాటితో ఆనం రాంనారాయణ రెడ్డి భేటీ.. సెప్టెంబర్ 2న వైసీపీ తీర్థం?
- నెల్లూరులో మారుతున్న రాజకీయాలు
- వెంకటగిరిపై ఆనం కన్ను
- కాకాణి గోవర్ధన్ రెడ్డితోనూ సమావేశం
జిల్లాలో రాజకీయ పరిస్థితులు, వైసీపీలో చేరిక తదితర అంశాలపై మేకపాటితో ఆనం ముచ్చటించినట్టు సమాచారం. మేకపాటితో భేటీకి ముందు ఆనం నెల్లూరు జిల్లా వైసీపీ చీఫ్ కాకాణి గోవర్ధన్ రెడ్డితోనూ గురువారం సమావేశమయ్యారు.
కాగా, సెప్టెంబర్ 2న మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా జగన్ సమక్షంలో ఆనం వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రజా సంకల్పయాత్ర పూర్తయ్యాక నెల్లూరులో భారీ బహిరంగ సభను ఆనం వర్గీయులు ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆనం వెంకటగిరి సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.