‘అంతకుమించి’ సినిమా హీరోపై కేసు నమోదు!
- తన డబ్బులు ఇవ్వలేదన్ననిర్మాత
- కోర్టు ఆదేశాలను ధిక్కరించాడని వ్యాఖ్య
- పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమా నిర్మాణం ఆగిపోగా కమలాపురి కాలనీకి చెందిన సతీష్ జాయ్ ముందుకొచ్చాడన్నారు. సినిమాను నిర్మించడంతో పాటు హీరోగా నటించాడని వెల్లడించారు. సినిమా టైటిల్ తో పాటు ఇప్పటివరకూ చేసిన ఖర్చుకుగానూ రూ.50 లక్షలు ఇస్తానని మాట ఇచ్చాడని పేర్కొన్నారు. కానీ సినిమా పూర్తయినా తనకు డబ్బులు ఇవ్వలేదని వాపోయారు.
దీంతో తాను కోర్టును ఆశ్రయించగా సినిమాను వచ్చే నెల 4 వరకూ విడుదల చేయొద్దని న్యాయస్థానం ఆదేశించిందని ప్రసాద్ తెలిపారు. కానీ సతీష్ మాత్రం ఈలోపే సినిమాను విడుదల చేశాడన్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో పాటు తనను మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సతీష్ వెల్లడించారు.