Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • అనుష్కను ఫైనల్ చేసిన కొరటాల 
  • రాజమహేంద్రవరంలో సూర్య షూటింగ్ 
  • దసరాకి వస్తున్న 'అదుగో'!

*  'సైరా' సినిమా తర్వాత చిరంజీవి తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. రైతు పాత్రలో చిరంజీవి కనిపించే ఈ చిత్రంలో ఆయన సరసన అనుష్కను కథానాయికగా ఖరారు చేసినట్టు సమాచారం. వచ్చే డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
*  తమిళ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న 'ఎన్.జి.కె' (నంద గోపాలన్ కుమరన్) చిత్రం తదుపరి షెడ్యూల్ షూటింగ్ రేపటి నుంచి రాజమహేంద్రవరంలో జరుగుతుంది. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు.    
*  నటుడు, దర్శకుడు రవిబాబు రూపొందించిన 'అదుగో' చిత్రం దసరాకు విడుదల కానుంది. ఓ పందిపిల్ల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని భారతీయ భాషలన్నిటిలోనూ విడుదల చేయనున్నారు.

More Telugu News