చిరంజీవితో సినిమా అంటే పెద్ద బాధ్యత .. అందుకే సురేందర్ రెడ్డి వెంటనే ఒప్పుకోలేదు: చరణ్

- పరుచూరి బ్రదర్స్ తపనే 'సైరా'
- ముందు సురేందర్ రెడ్డి ఓకే చెప్పలేదు
- సింగిల్ సిట్టింగ్ లో నాన్నను మెప్పించాడు
దర్శకుడు సురేందర్ రెడ్డితో 'ధ్రువ' సినిమా నుంచి నాకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. సురేందర్ రెడ్డి వేరే కథల కోసం వెదుకుతున్నప్పుడు, పరుచూరి గారి దగ్గర 'సైరా' కథ ఉందని చెప్పేసి వాళ్ల దగ్గరికి పంపించాను .. ఆ కథను నాన్నతో చేస్తే బాగుంటుందని అన్నాను. నేను అడిగాను కదా అని చెప్పేసి వెంటనే సురేందర్ రెడ్డి ఒప్పుకోలేదు. చిరంజీవి గారితో సినిమా అంటే పెద్ద బాధ్యత .. అందువలన ఆయన కొంత సమయం తీసుకున్నారు. కథను పూర్తిగా పరిశీలించిన తరువాత .. దానిపై పూర్తిగా అవగాహన తెచ్చుకున్నాక నాన్నగారిని కలిసి సింగిల్ సిట్టింగ్ లో మెప్పించాడు' అంటూ చెప్పుకొచ్చాడు.