Krishna: కృష్ణమ్మకు మళ్లీ భారీ వరద... 2.80 లక్షలకు పెరిగిన ఇన్ ఫ్లో!

  • ఈ ఉదయం 2.30 లక్షల క్యూసెక్కులు
  • 11 గంటలకు 2,80,916 క్యూసెక్కులకు పెరిగిన వరద
  • దిగువకు 2,70,229 క్యూసెక్కులు

ఈ ఉదయం 2.30 లక్షల క్యూసెక్కులకు పైగా నమోదైన కృష్ణానది వరద 11 గంటల సమయానికి మరో 50 వేల క్యూసెక్కులు పెరిగి 2,80,916 క్యూసెక్కులుగా నమోదైంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం అధికంగా ఉందని అధికారులు అంటున్నారు. ఆల్మట్టికి 1,28, 438 క్యూసెక్కుల వరద వస్తుండగా, 1,25569 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ ఇన్ ఫ్లో 1,21,364 క్యూసెక్కులుగా నమోదుకాగా, 1,12,358 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

ఇక జూరాలకు 1,36,638 క్యూసెక్కులు వస్తుండగా, 1,36,163 క్యూసెక్కులను, తుంగభద్రకు 92,673 క్యూసెక్కుల వరద వస్తుండగా, 70,995 క్యూసెక్కులను వదులుతున్నారు. ఈ నీరంతా శ్రీశైలానికి పోటెత్తుతుండగా, జలాశయం నుంచి కాలువలు, ఎత్తిపోతల పథకాలు, విద్యుత్ ఉత్పత్తి, స్పిల్ వేల ద్వారా 2,70,229 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నీటిలో వ్యవసాయ, సాగునీటి అవసరాల నిమిత్తం తరలిస్తున్న నీరు పోను 1,76,797 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు వస్తోంది.

More Telugu News