విషాదంలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుటుంబం!
- జలీల్‌ఖాన్ సోదరుడి కుమారుడు గుండెపోటుతో మృతి
- ఆటోనగర్‌లో ఐరన్ వ్యాపారం చేసే మోసిన్‌ఖాన్
- ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
27సంవత్సరాల మోసిన్‌ఖాన్ ఆటోనగర్‌లో ఐరన్ వ్యాపారం చేసేవాడు. ఆటోనగర్ లోని షాప్ లో ఉండగా గుండెపోటు రావడంతో వెంటనే బయలుదేరి సూర్యారావుపేటలోని ఓ ప్రైవేటు హాస్పటల్‌కు వెళ్ళాడు. తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం కూడా తెలియజేశాడు. అయితే, గుండెపోటు తీవ్రంగా రావడంతో కాసేపటికే మృతి చెందాడు. చెట్టంత కొడుకు మృతితో జలీల్ ఖాన్ సోదరుడు షాక్ కు గురయ్యారు. కుటుంబం అంతా కన్నీటి పర్యంతం అవుతోంది. మోసిన్‌ఖాన్ మృతదేహాన్ని పాతబస్తీ తారాపేటలోని ఎమ్మెల్యే నివాసానికి తరలించారు. మృతుడుకి భార్య, ఆరునెలల కూతురు ఉన్నారు.