వాజ్ పేయి చివరి ఫొటో.. దాని వెనకున్న కథ!
- 2009 నుంచి ప్రజా జీవితానికి దూరంగా వాజ్ పేయి
- జ్ఞాపక శక్తిని కోల్పోయి ఇంటికే పరిమితం
- 2015లో భారతరత్న పురస్కారం వేళ తీసిన ఫొటో
- ఆపై మరెక్కడా కనిపించని వాజ్ పేయి
ఆ ఫొటోను సైతం వ్యూహాత్మకంగానే తీశారు. వాజ్ పేయి పూర్తిగా కనిపించకుండా రాష్ట్రపతి సహాయకుడి చేతిని అడ్డు పెట్టించారు. అప్పటికే వాజ్ పేయి కదల్లేని, స్వయంగా స్పందించలేని స్థితిలో ఉండటమే ఇందుకు కారణం. ఆ సమయంలో ఏ జర్నలిస్టునూ లోనికి అనుమతించలేదు. వాజ్ పేయి కళ్లను అద్దాలతో మూసేశారు. ఓ వీల్ చైర్ లో వాజ్ పేయి కూర్చుని ఉండగా, ప్రణబ్ ముఖర్జీ సన్మానిస్తున్నట్టు ఈ చిత్రం కనిపిస్తుంది. రాష్ట్రపతి నిలబడి, వాజ్ పేయి కూర్చుని ఉన్నారంటే, అప్పటికే ఆయన నిలబడే స్థితిలో లేరని తెలుస్తోంది. ఆ తరువాత ఆయన కనిపించిన ఫొటో అంటే, నిన్న మరణించిన తరువాతనే.