'గీత' పాత్ర మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది: రష్మిక మందన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గీత' పాత్ర మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది: రష్మిక మందన

  • 'డియర్ కామ్రేడ్'లోను నాది మంచి పాత్ర
  • మేకప్ లేకుండగా కనిపిస్తాను 
  • సహజత్వానికి చాలా దగ్గరగా వుంటుంది   
రష్మిక మందన తాజా చిత్రంగా 'గీత గోవిందం' చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమాకి సక్సెస్ టాక్ వచ్చింది. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ .. "ఈ సినిమాలో 'గీత' పాత్ర నాకు బాగా నచ్చింది. అటు ఆడియన్స్ .. ఇటు ఇండస్ట్రీలోని పెద్దలు బాగా చేశానని అంటుంటే ఆనందంగా అనిపిస్తోంది. నా పాత్రను నేను బాగా చేయడంలో విజయ్ సహకారం కూడా ఎంతో వుంది .. తన పాత్రలో తనూ చాలా బాగా చేశాడు.

కథలోని కామెడీకి మంచి మార్కులు పడతాయని ముందుగానే అనుకున్నాను .. థియేటర్లో ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా  చూస్తున్నప్పుడు నా అంచనా నిజమేనని అర్థమైంది. 'డియర్ కామ్రేడ్' సినిమాలోను నా పాత్ర చాలా బాగుంటుంది. ఈ సినిమాలో మేకప్ లేకుండగా ఒక సాధారణమైన అమ్మాయిలా కనిపిస్తాను. సహజత్వానికి చాలా దగ్గరగా నా పాత్ర ఉంటుంది. ఈ పాత్ర కథానాయికగా నన్ను మరో మెట్టు ఎక్కిస్తుందనే నమ్మకం వుంది" అంటూ చెప్పుకొచ్చింది.   
rashmika

More Telugu News