వాజ్ పేయిని పరామర్శించిన రాహుల్ గాంధీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాజ్ పేయిని పరామర్శించిన రాహుల్ గాంధీ

  • ఎయిమ్స్ కు వెళ్లి పరామర్శించిన రాహుల్
  • వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
  • రాహుల్ వెంట పార్టీ నేతలు
ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో వాజ్ పేయిని పరామర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్ది సేపటి క్రితం ఆసుపత్రికి చేరుకున్నారు. వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ వెంట పార్టీ నేతలు ఉన్నారు. కాగా, వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిపై మరి కాసేపట్లో హెల్త్ బులిటెన్ విడుదల కానుంది. ఇప్పటికే అన్ని అధికారిక కార్యక్రమాలను బీజేపీ రద్దు చేసుకుంది.
vajpayee
Rahul Gandhi

More Telugu News