paruchuri: నటులను తక్కువ అంచనా వేయకూడదన్న విషయం అప్పుడే తెలిసింది నాకు: పరుచూరి గోపాలకృష్ణ

  • గుమ్మడికి ఆ పాత్ర ఇస్తానన్నారు 
  • ఆడియన్స్ అంగీకరించరేమో అన్నాను 
  • గుమ్మడి ఆ పాత్రలో జీవించారు

పరుచూరి బ్రదర్స్ కథలను .. సంభాషణలను అందించిన ఎన్నో సినిమాలు సంచలన విజయాలను సాధించాయి. హీరోల బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా .. వాళ్ల డైలాగ్ డెలివరీని బట్టి సందర్భానికి తగినట్టుగా అద్భుతమైన సంభాషణలను అందించిన ఘనత వాళ్ల సొంతం. అలాంటి పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన గోపాలకృష్ణ తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో గుమ్మడి వెంకటేశ్వరరావు గురించి చెప్పుకొచ్చారు.

"గుమ్మడి గారికి మేము రాసిన మొదటి సినిమా 'ముందడుగు'. ఈ సినిమాకి కాస్త కుడి ఎడమగా 'మరో మలుపు' విడుదలైంది. గుమ్మడి చాలా చిత్రాల్లో శ్రీమంతుడుగా .. జమీందారుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి పాత్రలలో ఆయనని చూడటానికే అంతా అలవాటుపడిపోయారు. 'ముందడుగు'లో ఆయన శ్రీమంతుడుగానే కనిపిస్తారు .. కానీ 'మరో మలుపు'లో మాత్రం ఆయన పేద బ్రాహ్మణుడుగా కనిపిస్తారు.

ఈ పాత్రను గుమ్మడితో చేయించాలనుకుంటున్నట్టు దర్శకుడు వేజెళ్ల సత్యనారాయణగారు చెప్పారు. జమీందారుగా ఆయనను తెరపై చూడటానికి అలవాటు పడిపోయిన ప్రేక్షకులు .. పేద బ్రాహ్మణుడి పాత్రలో అంగీకరించరేమోనని నేను ఆయనతో అన్నాను. అయితే ఈ విషయంలో నేను పొరపాటు పడ్డాననే విషయం ఆ తరువాత నాకు అర్థమైంది. పేద బ్రాహ్మణుడి పాత్రలో గుమ్మడి జీవించారు .. ఏరోజుకారోజు ప్రసాదం తిని బతికే పూజారిగానే ఆయన తెరపై కనిపించారు. అందుకనే నటులను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు" అని అన్నారు.  

More Telugu News