రాహుల్ తో పాటు బస్సెక్కిన టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్ తో పాటు బస్సెక్కిన టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య

  • రాహుల్ గాంధీని కలిసిన కృష్ణయ్య
  • చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల అంశమై చర్చ
  • గన్ పార్క్ వరకు రాహుల్ తో బస్సులో వచ్చిన కృష్ణయ్య
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ నాయకుడు ఆర్. కృష్ణయ్య కలిశారు. తాజ్ కృష్ణాలో రాహుల్ తో కలిసి మూడు గంటల పాటు ఆయన కలిసి ఉన్నట్టు సమాచారం. కాగా, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల అంశమై మాట్లాడేందుకు రాహుల్ ని తాను కలిశానని అనంతరం మీడియాతో మాట్లాడిన కృష్ణయ్య స్పష్టం చేశారు.

గతంలో జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు కోసం తాను చేసిన పోరాటం ఫలించిన విషయాన్ని కృష్ణయ్య ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాహుల్ తో తన భేటీకి రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాగా, గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి రాహుల్ నివాళులర్పించారు. గన్ పార్క్ వద్దకు రాహుల్ తమ పార్టీ నేతలతో కలిసి ప్రజా చైతన్య బస్సులో వెళ్లారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు కృష్ణయ్య కూడా ఆ బస్సులో ఎక్కి, వారితో కలిసి ప్రయాణించారు.  
Rahul Gandhi
R.krishnaiah

More Telugu News