dmk: ఈనెల 14న స్టాలిన్ కు పట్టాభిషేకం!

షార్ట్స్‌లో చూడండి
కరుణానిధి మరణంతో డీఎంకే అధ్యక్షుడి స్థానం ఖాళీ అయింది. దీంతో, ఆయన స్థానంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ను నియమించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 14న స్టాలిన్ పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించినట్టు సమాచారం. పార్టీలో సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి అన్బళగన్ వయసు 96 ఏళ్లు కావడంతో... తప్పని స్థితిలో కరుణానిధి కుటుంబానికే అధ్యక్ష బాధ్యతలను అప్పగించాల్సిన పరిస్థితి నెలకొంది.

మరోవైపు, తన రాజకీయవారసుడు స్టాలినే అంటూ గతంలోనే కరుణ పలు సందర్భాల్లో చెప్పకనే చెప్పారు. గత ఎన్నికల సమయంలో స్టాలిన్ రాష్ట్రమంతా తిరిగి... ప్రధాన ప్రతిపక్ష పార్టీకి గతంలో ఎన్నడూ లేని విధంగా 89 స్థానాలను సాధించిపెట్టారు. దీనిపై సంతోషాన్ని వ్యక్తం చేసిన కరుణ... పార్టీని నడిపించే సత్తా స్టాలిన్ కే ఉందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో, పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్టాలిన్ చేపట్టబోతున్నారు.
Go Back to Shorts
dmk
president
stalin

More Telugu News