Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
*  ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఓ చిత్రంలో గెస్ట్ పాత్ర పోషిస్తోంది. శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'పడి పడి లేచె మనసు' సినిమాలో కాజల్ గెస్ట్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది.
*  సీనియర్ నటుడు అర్జున్ నటించిన 'కురుక్షేత్రం' చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయింది. ఇందులో వైభవ్, సుమన్, వరలక్ష్మి, సుహాసిని ఇతర పాత్రలు పోషించారు.
*  తాజాగా విడుదలైన 'శ్రీనివాస కళ్యాణం' చిత్రంలో హీరోయిన్ గా నటించిన రాశిఖన్నాకు కథానాయిక ప్రధాన చిత్రాలు చేయాలనుందట. తమిళంలో తనకి ప్రస్తుతం మంచి పాత్రలు వస్తున్నాయని, ఇదే సమయంలో హీరోయిన్ ప్రధాన చిత్రాలు కూడా వస్తే త్వరగా పేరు తెచ్చుకోవచ్చని చెప్పింది. అలాంటి సినిమాల కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది. ప్రస్తుతం తమిళంలో ఈ చిన్నది మూడు చిత్రాలలో నటిస్తోంది.
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న 'నవాబ్' (తమిళంలో చక్క చివంత వానం) చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. విజయ్ సేతుపతి, అరవింద్ సామి, జ్యోతిక, అదితీ రావు హైదరీ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Go Back to Shorts
Kajal Agarwal
Arjun
Rashikhanna
Maniratnam

More Telugu News