Amaravathi: బిడ్డింగ్‌కు సిద్ధమైన అమరావతి బాండ్లు.. రాజధాని నిర్మాణానికి నిధుల సేకరణకు ప్రభుత్వం రెడీ!

షార్ట్స్‌లో చూడండి
పెట్టుబడిదారుల నుంచి రూ. 2 వేల కోట్లను సేకరించే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి బాండ్లు బిడ్డింగ్‌కు రెడీ అయ్యాయి. ఈ నెల 14 లేదంటే 15వ తేదీల్లో ఇవి బిడ్డింగ్‌కు రానున్నట్టు సమాచారం. ఏపీ సీఆర్డీఏ జారీ చేస్తున్న ఈ బాండ్లపై పెట్టుబడిదారులకు 10.32 శాతం త్రైమాసిక వడ్డీ చెల్లిస్తారు. ఈ మొత్తం  ప్రక్రియకు ఏకే క్యాపిటల్ సర్వీసెస్ మర్చంట్ బ్యాంకర్‌గా వ్యవహరిస్తోంది. దీంతో ఈ సంస్థకు 0.85 శాతం (జీఎస్టీ అదనం) ఇచ్చేందుకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బీఎస్‌ఈ), ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ప్లాట్‌ఫాం (ఈబీపీ) విధానంలో బిడ్డింగ్ నిర్వహించాల్సి ఉండడంతో ప్రభుత్వం నియమించిన స్టాండింగ్ కమిటీ సభ్యులతో చర్చించిన అనంతరం ఈ బాండ్లను అప్‌లోడ్ చేయాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. శుక్రవారం కనుక స్టాండింగ్ కమిటీ నుంచి అంగీకారం లభిస్తే వెంటనే అప్‌లోడ్ చేసేస్తారు. మంగళవారం బిడ్డింగ్ జరుగుతుంది. నేడు కనుక అప్‌లోడింగ్ సాధ్యం కాకుంటే సోమవారం పూర్తి చేసి బుధవారం బిడ్డింగ్ నిర్వహిస్తారు.  
Go Back to Shorts
Amaravathi
Andhra Pradesh
Amaravathi Bonds
Chandrababu

More Telugu News