కరుణానిధి మరణంతో నెల్లూరుకు పోటెత్తిన తమిళ తంబీలు!
- మద్యం దొరక్క మందుబాబుల విలవిల
- సూళ్లూరు పేట, తడకు భారీగా రాక
- కిటకిటలాడిన మద్యం షాపులు
కరుణానిధి మంగళవారం సాయంత్రం చనిపోగానే తమిళనాడులోని మద్యం షాపుల్ని మూసేశారు. రెండ్రోజుల పాటు షాపులు ఓపెన్ కాకపోవడంతో మందు బాబులు అల్లాడిపోయారు. బస్సు దొరికితే బస్సు, రైలు దొరికితే రైలు ఎక్కి నెల్లూరు జిల్లాలోని తడ, సూళ్లూరు పేటలో దిగిపోయారు. దీంతో ఈ మార్గంలో తిరిగే వాహనాలన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. తొలుత మద్యం షాపుల ముందు సందడిని చూసి ఆశ్చర్యపోయిన ప్రజలు చివరికి విషయం తెలుసుకుని నవ్వుకున్నారు.