Virat Kohli: కోహ్లీని ప్రేమించానన్న మహిళా క్రికెటర్ తో సచిన్ కుమారుడి లంచ్!

  • 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని కోహ్లీని అడిగిన డేనియల్ వ్యాట్
  • ఇంగ్లండ్ లో అర్జున్ టెండూల్కర్ తో లంచ్
  • వారి స్నేహంపై గుసగుసలు, కొత్త చర్చ
గతంలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించానని చెబుతూ, 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని ట్వీట్ చేసిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ గుర్తుందా? ఇప్పుడామెతో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ లంచ్ చేస్తూ కనిపించి చిన్న సైజు కొత్త చర్చకు తెరలేపాడు. శ్రీలంకతో అండర్ -19 యూత్ టెస్టు సిరీస్ తరువాత అర్జున్ ను ముంబై ఆఫ్ సీజన్ క్యాంప్ నకు ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ వెళ్లిన అర్జున్, వ్యాట్ లు కలసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి మధ్య ఉన్న స్నేహం ఎంతవరకూ వెళ్లిందోనంటూ గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
Virat Kohli
Sachin Tendulkar
Arjun Tendulkar
England
Lunch Date

More Telugu News