హెల్త్ బులెటిన్ విడుదల.. కరుణానిధి ఆరోగ్యం విషమం!

  • గతంలో కంటే క్షీణించిన కరుణానిధి ఆరోగ్యం 
  • వయో భారం కారణంగా తలెత్తే రుగ్మతలతో ఇబ్బంది
  • నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో కరుణానిధి
డీఎంకే అధినేత కరుణానిధికి సంబంధించిన హెల్త్ బులెటిన్ ను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. దీనిని బట్టి గతంలో కంటే కరుణానిధి ఆరోగ్యం క్షీణించినట్టు, పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కరుణానిధి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు చికిత్సకు స్పందిస్తున్నప్పటికీ, వయో భారం కారణంగా తలెత్తే రుగ్మతలు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాయని చెన్నైలోని కావేరి ఆసుపత్రి వైద్యుడు అరవిందన్ సెల్వరాజ్ చెప్పారు.

వయోభారం రీత్యా కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉంచడం సవాలుగా ఉందని, ప్రస్తుతం నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన ఉన్నారని అన్నారు. రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కరుణకు జరిగే చికిత్సకు ఆయన శరీరం స్పందించే తీరును అనుసరించి పరిస్థితిని అంచనా వేస్తామని చెప్పారు.
Go Back to Shorts
karunanidhi
health bulletin

More Telugu News