Adavi Shesh: అమెరికాలో దూసుకుపోతున్న 'గూఢచారి'!

షార్ట్స్‌లో చూడండి
అమెరికాలో మరో తెలుగు సినిమా సత్తా చాటుతోంది. అక్కడి తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అడవి శేష్ హీరోగా శశికిరణ్ టిక్కా దర్శకత్వంలో రూపొందిన 'గూఢచారి' చిత్రం ఈ ఘనతను సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే ఈ చిత్రానికి మంచి హిట్ టాక్ వచ్చింది. చిన్న బడ్జెట్టులో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్ద సినిమాగా సత్తా చాటుతోంది.

 ఈ క్రమంలో గత శుక్రవారం అమెరికాలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు 2 కోట్ల 14 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. గురువారం నాడు ఏర్పాటు చేసిన ప్రీమియర్ షో ద్వారా 52,394 డాలర్లు, శుక్రవారం షోల ద్వారా 1,02,994 డాలర్లు, శనివారం నాటి షోల ద్వారా 1,56,009 డాలర్లు వసూలు చేసినట్టు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.

కేవలం 112 లొకేషన్లలో రెండు రోజుల్లో ఇంత మొత్తం వసూలు చేయడం, సినిమా కథలో వున్న దమ్ముకి నిదర్శనమని ఆయన అన్నారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ కథానాయికగా నటించింది. 
Go Back to Shorts
Adavi Shesh
Shobhita
USA

More Telugu News