Chittoor District: చిత్తూరులో దారుణం... భార్యపై కోపంతో ముగ్గురు బిడ్డలను నదిలో విసిరిన తండ్రి!

  • ముగ్గురు పిల్లలను నీవా నదిలో పడేసిన వెంకటేశ్
  • ఆపై పారిపోయిన వెంకటేశ్, కేసు నమోదు
  • ఉరిశిక్ష విధించాలని గ్రామస్థుల డిమాండ్
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ వారి ముగ్గురు బిడ్డల ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వెంకటేష్ అనే వ్యక్తి, భార్యతో గొడవపడి, ఆ కోపంతో తన ముగ్గురు పిల్లలనూ నీవా నదిలో పడేశాడు. పునీత్ (6), సంజయ్ (3), రాహుల్ (1)లను వెంకటేశ్ నదిలో విసిరి, పారిపోగా, ముగ్గురు బిడ్డలూ మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న వెంకటేశ్ కోసం గాలిస్తున్నారు. వెంకటేష్ ను వెంటనే అరెస్ట్ చేసి, ఉరిశిక్ష విధించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
Chittoor District
Gangadhara Nellore
Murder
Wife
Neva river

More Telugu News