అక్రమంగా ఉన్న బంగ్లాదేశీలను తరిమేయాలా? వద్దా?: విషక్షాలపై మండిపడ్డ అమిత్ షా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అక్రమంగా ఉన్న బంగ్లాదేశీలను తరిమేయాలా? వద్దా?: విషక్షాలపై మండిపడ్డ అమిత్ షా

  • అసోంలో అక్రమంగా ఉన్న బంగ్లాదేశీలను తరిమేసేందుకు ఎన్ఆర్సీ
  • వారిని పంపించేద్దామా? లేక ఇక్కడే ఉంచేద్దామా?
  • కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు తమ వైఖరిని తెలియజేయాలి
కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అసోంలో చేపట్టిన ఎన్ఆర్సీని కొనసాగించాలా? వద్దా? అని ప్రశ్నించారు. అక్రమంగా ఇండియాలో ఉంటున్న బంగ్లాదేశీలను ఇక్కడే ఉంచేద్దామా? వద్దా? అనే విషయంపై కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అసోంలో అక్రమంగా ఉంటున్న వారిని తరిమి వేసేందుకే తాము ఎన్ఆర్సీని చేపట్టామని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే అసోంలో బీజేపీ ఎన్ఆర్సీని చేపట్టిందనే వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
amit shah
nrc
congress
bjp
sp
bsp

More Telugu News