India: భారత పార్లమెంట్ ఎన్నికలపై గురి పెట్టిన రష్యా... సంచలన విషయాన్ని బయటపెట్టిన ఆక్స్ ఫర్డ్ నిపుణులు!

  • రెండేళ్ల క్రితం అమెరికా ఎన్నికల్లో జోక్యం
  • ప్రస్తుతం విచారిస్తున్న సెనేట్ కమిటీ
  • అమెరికా, బ్రెజిల్ ఎలక్షన్లను రష్యా టార్గెట్ చేసిందన్న ఫిలిప్ హోవార్డ్

గతంలో అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసిందని ఆరోపణలను ఎదుర్కొంటున్న రష్యా కన్ను వచ్చే సంవత్సరం ఇండియాలో జరిగే పార్లమెంట్ ఎన్నికలపై పడిందా? అంటే అవుననే అంటున్నారు ప్రతిష్ఠాత్మక ఆక్స్ ఫర్డ్ వర్శిటీ నిపుణులు. ఇండియా, బ్రెజిల్ తదితర దేశాల్లో దేశాల్లో జరిగే ఎలక్షన్స్ ను టార్గెట్ చేసుకుందని వర్శిటీ సోషల్ మీడియా ఎక్స్ పర్ట్స్ హెచ్చరించారు.

ఇటీవల ఇదే విషయాన్ని యూఎస్ సెనేటర్ల ముందు ఆక్స్ ఫర్డ్ ఇంటర్నెట్ ఇనిస్టిట్యూట్ లో ఇంటర్నెట్ స్టడీస్ విభాగం స్టాచ్యూటరీ ప్రొఫెసర్ గా ఉన్న ఫిలిప్ హోవార్డ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో మాదిరిగా పలు దేశాల్లో మీడియా స్వేచ్ఛగా లేకపోవడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారనుందని ఆయన అన్నారు. కాగా, రెండేళ్ల క్రితం జరిగిన యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో రష్యా జోక్యం చేసుకుందని, సోషల్ మీడియా ద్వారా ఓటర్లను ప్రభావితం చేసిందని వచ్చిన ఆరోపణలను యూఎస్ నిఘా సంస్థలు ధ్రువీకరించగా, ప్రస్తుతం సెనేట్ కమిటీ దానిని విచారిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News