భారీ మూవీ అయినప్పటికీ తప్పుకోవడానికి కారణమదే: త్రిష
- నాయిక పాత్ర నాకు తగినదిగా లేదు
- అందుకే ఆరంభంలోనే నో చెప్పాను
- అప్పటికి షూటింగ్ మొదలుకాలేదు
త్రిష ఈ మూవీ నుంచి తప్పుకోవడం వల్లనే కీర్తి సురేశ్ ను తీసుకున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయాన్ని గురించి త్రిష స్పందిస్తూ .. "ఈ సినిమా భారీ బడ్జెట్ తో కూడినదే అయినా, కథానాయిక పాత్ర నాకు తగినట్టుగా లేదనిపించింది. అందువల్లనే ఈ ప్రాజెక్టు నుంచి ఆరంభంలోనే తప్పుకున్నాను. షూటింగు మొదలుకాక మునుపే నా నిర్ణయం చెప్పాను" అంటూ అసలు విషయాన్ని స్పష్టం చేసింది. శిబు తమీన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో మరో కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ నటిస్తుండగా, విలన్ గా బాబీ సింహా చేస్తున్నాడు.