టేకాఫ్ అవుతుండగా కూలిన విమానం.. చుట్టుముట్టిన మంటలు.. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు!

  • వడగళ్ల వాన కారణంగా కూలిన విమానం
  • 80 మందికి గాయాలు
  • నమ్మలేనంత నిజంగా ఉందన్న ప్రయాణికులు
మెక్సికోలో టేకాఫ్ అవుతున్న విమానం కూలిన ఘటనలో వందమంది ప్రయాణికులు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. వడగళ్ల వాన కారణంగా ఈ దుర్ఘటన సంభవించింది. విమానం కూలిన వెంటనే మంటలు చుట్టుముట్టాయి. అయితే, అదృష్టవశాత్తు అందులో ఉన్న 97 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

విమానం దురంగో నుంచి మెక్సికో సిటీకి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తాము ప్రాణాలతో బయటపడడం నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉందని ప్రయాణికులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో 80 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Go Back to Shorts
mexico
Flight
Crash
Passengers
Accident

More Telugu News