రాహుల్ గాంధీకి భార్య అయినా రావాలని కోరుకున్నా!: సాధ్వి ప్రాచి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్ గాంధీకి భార్య అయినా రావాలని కోరుకున్నా!: సాధ్వి ప్రాచి

  • వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువు సాధ్వి ప్రాచి
  • రాహుల్ ను ఉద్దేశిస్తూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
  • సాధ్విగా ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదన్న కాంగ్రెస్
సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువైన హిందూ నేత సాధ్వి ప్రాచి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ నాథ్ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. గోరఖ్ నాథ్ ఆశీస్సుల కోసం క్రమం తప్పకుండా తాను ఇక్కడకు వస్తుంటానని... కానీ, ఈసారి మాత్రం ఒక ప్రత్యేకమైన కోరికను కోరుకోవడానికి వచ్చానని తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని కాంగ్రెస్ సాధించలేకపోయిన పక్షంలో... కనీసం రాహుల్ గాంధీకి భార్య అయినా రావాలని కోరుకున్నానని చెప్పారు. మరోవైపు సాధ్వి ప్రాచి వ్యాఖ్యలపై యూపీ కాంగ్రెస్ నేత అశోక్ సింగ్ స్పందించారు. కాంగ్రెస్ నేతలను అవహేళన చేసే విధంగా మాట్లాడటం వారికి పరిపాటిగా మారిందని ఆయన విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ, తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక సాధ్విగా ఉంటూ, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు.
sadhvi prachi
Rahul Gandhi

More Telugu News